అలిసార సోలిసార
అలసత్వం మనకొద్దు
వాలార పలర
పోరాటం మరవొద్దు
చీకట్లో చుక్కలోలె
తుపానులో మంటలోలె
పోరాటం విడోద్దు
పొద్దుపొడుపు జరోద్దు
బయపడితే బాధపడితే బ్రతకలేము
తడబడితే పొరబడితే పోరాటం చేయలేము
కలబడితేనే కార్యసాధకులమవుతము
నిలబడి నిబ్బరం ప్రదర్శిస్తేనే
నిజమైన విజేతలమావుతం
ఉదయాస్తమాయలు సూర్యుడికే తప్పలేదు
మన ఉద్యమనికెంత ?
ఏ దారిలోనైన ఎత్తు పల్లాలు ఉంటాయి
ఏ పోరాటం లోనైనా జయాపజయాలు ఉంటాయి
ఏ ఉద్యమం లోనైనా సంది సందిగ్ద సమయాలు ఉంటాయి
సందిగ్దత వదిలేద్దాం
సమరం కొనసాగిద్దాం
సందికాలం పురిద్ధం
నేల రాలిన అమర వీరులకు
అరుణ తారలై నింగికేగిసిన పోరు యోదులకు
అభినవ ఉద్యమ దీరులకు
పోరాటాన్నే పుష్ప మాలలుగా వేద్దాం
చినుకు చినుకు కలిసి వరదైనట్లు
వరద ఉద్రుతికి ఉళ్ళు ఉప్పెనైనట్లు
కరం కరం కలిపి పోరాటం చేద్దాం
తెలంగాణ ఉద్యమ ఉదృతి లో
ఉప్పొంగిన వరద పొంగులో
ఉద్యమం లో రంగులు మార్చే ఉసరవేల్లుల్ని
అవాలి తీరం వరకు నేట్టేధం
పోరువారదతో కల్లాపి చల్లి
కులిశిత లోగిల్లను శుబ్రం చేసుకుందాం
దేవుడు దిగొచ్చిన
దేహం ముక్కలైన
రాష్ట్రము ముక్కలయ్యేదాకా
రోజుకో తీరు ఉద్యమమై రాజుకుందాం
పోరు కెరటాలై పోటెత్తుదాం
పోరాటాన్ని ప్రతిఘటించిన వాడిని పాతిపెడుదం
పోరాటం లో కలబడుదాం
పోరులో గెలిచి నిలబడుడం
జై తెలంగాణ జై జై తెలంగాణ
(ఉద్యమం లో ప్రస్తుతం నెలకొన్న సంది కాలాన్ని వదిలి సమరం కొనసాగిద్దాం తెలంగాణ సాదిద్దాం)
రచన



October 14, 2012 at 9:40 am
Jai Telangaana Mana Baasha Mana Yaasa